సీఎం కేసీఆర్ పరమ దుర్మార్గుడు.. బండి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరమ దుర్మార్గుడిగా అభివర్ణించారు. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణిస్తే వారిని కనీసం పరామర్శించకుండా రాజకీయ పర్యటన కోసం బీహార్ వెళతారా అని విమర్శించారు.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మహిళలకు మరణించడానికి కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం, మూర్ఖత్వమే కారణమని నిందించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ బుధవారం పరామర్శించారు. ఆ సందర్బంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ బాధితులను పరామర్శించకుండా బీహార్ వెళ్ళటం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలోని పేదలను వదిలేసి పంజాబ్, బీహార్‌లో డబ్బులు పంచటం దారుణమన్నారు.

ఆపరేషన్లు వికటించి మరణించిన   మహిళల పిల్లల చదువు, భవిష్యత్తు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని   డిమాండ్ చేశారు.   రికార్డు కోసం గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. సీఎం సర్కార్‌కు పేదల ప్రాణాల కంటే పేరు ప్రఖ్యాతలే ముఖ్యమా అని నిలదీశారు.

 రాష్ట్ర సీఎంకు పేదల ఉసురు కచ్చితంగా తగులుతుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుంటామంటే అంగీకరించేది లేదన్నారు.  బెదిరించి ఆపరేషన్లు చేశారని చికిత్స పొందుతోన్న మహిళలే స్వయంగా చెప్తున్నారని బండి సంజయ్ అన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu