జీవితకి బెయిల్ మంజూరు

 

డాక్టర్ రాజశేఖర్ భార్య జీవితకిచెక్ బౌన్స్ కేసులో హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు రెండేళ్ళ జైలుశిక్ష, 25 లక్షల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ‘ఎవడైతే నాకేంటి’ సినిమా నిర్మాతకు జీవిత ఇచ్చిన 22 లక్షల రూపాయల చెక్కు బౌన్స్ కావడంతో ఈ శిక్ష విధించారు. అయితే జీవిత కోర్టుకు 25 లక్షల డబ్బు చెల్లించి బెయిల్ పొందారు. అనంతరం కోర్టు బయట జీవిత మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసు విషయంలో రాజీ పడబోనని, సుప్రీం కోర్టుకు వెళ్ళడానికైనా సిద్ధంగా వున్నానని ఆమె అన్నారు. నిజానికి తాను ‘ఎవడైతే నాకేంటి’ నిర్మాతకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆయనే తనకు బాకీ వున్నాడని చెప్పారు. న్యాయస్థానం ఇచ్చిన  తీర్పును గౌరవిస్తూ కోర్టులో 25 లక్షలు డిపాజిట్ చేశానని, ఈ అంశం మీద తాను న్యాయపోరాటం చేస్తానని ఆమె అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu