భార్యని అడ్డంగా నరికిన భర్త

 

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరంలో బొండా అప్పారావు అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో గుట్టుగా సంసారాన్ని నడుపుకుంటున్నాడు. అయితే ఆదివారం నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చిన అప్పారావు తన ఇంట్లో కనిపించిన దృశ్యాన్ని చూసి ఆగ్రహంతో రగిలిపోయాడు. ఇంటో తన భార్య తన ప్రియుడితో కలసి వుండటాన్ని చూసి ఆవేశాన్ని ఆపుకోలేని అప్పారావు వారిద్దరి మీద పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ దాడిలో అప్పారావు భార్య మరణించింది. ఆమె ప్రియుడు, అదే గ్రామానికి చెందిన సూరిబాబు యువకుడు పారిపోయాడు. పోలీసులు అప్పారావును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. తల్లి హత్య, తండ్రిని పోలీసులు పట్టుకోవడంతో వారి ఇద్దరి పిల్లలు అనాథలుగా మారారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu