స్మృతీ ఇరానీ రాష్ట్రపతి ఆశలు
posted on Nov 25, 2014 8:39AM

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాష్ట్రపతి అవుతారని రాజస్థాన్‌కి చెందిన ఓ జ్యోతిషుడు చెప్పారు. స్మృతి ఇరానీ రాజస్థాన్‌లోని భిల్వారాలో ఉన్న ఓ జ్యోతిష్యుడంటే బాగా నమ్మకం. స్మృతి ఇరానీ టీవీ నటిగా ఉన్న సమయంలో ఆయన్ని కలిస్తే నువ్వు మంత్రివి అవుతావని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఆమె మంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఆయనంటే ఆమెకి బాగా గురి కుదిరింది. ఇప్పుడు మళ్ళీ కలిసినప్పుడు ఆయన నువ్వు రాష్ట్రపతి అవుతావని చెప్పారు. అయితే కేంద్రమంత్రి హోదాలో వుండి జ్యోతిషుడిని కలవటం ఏమిటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే స్మృతి ఇరానీ మాత్రం ఆ విమర్శలను ఖండించారు. తన వ్యక్తిగత జీవితంలో తాను ఎవరినైనా కలిసే హక్కు వుందని దీనిని పెద్ద ఇష్యూ చేయాలనుకోవడాన్ని తాను పట్టించుకోనని ఆమె స్పష్టం చేశారు. టీఆర్‌పి రేటింగ్‌లు పెంచుకోవడం కోసమే టీవీ ఛానళ్ళు ఈ అంశాన్ని పెద్దదిగా చేస్తున్నాయని స్మృతి ఇరానీ అన్నారు.