మిల్లి సెకెన్ చాలు కరోనావైరస్ అంటుకోవడానికి!

చైనా కాల్చివెయ్యామంటుంది. నార్త్ కొరియా చంపివేయ్యమంటుంది. రష్యా జైల్లో పెట్టమంటుంది. కానీ ఒక్క భారతదేశం మాత్రమే ఇంట్లో కూర్చొని బ్రతికిపోమంటుంది.. మాయదారి కరోనా నుండి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకుందాం!

చావు బ్రతుకులు ఎక్కడో లేవు.. " ధైర్యం" లోనే బ్రతుకు ఉంది... "భయం" లోనే చావు ఉంది..! నువ్వు తప్పు చేయనంత వరకు.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు..! భయపడడం మొదలు పెడితే.. నీ నీడ కూడా నిన్ను భయపడుతుంది..!! కంటి మీద కులుకు లేకుండా చేస్తున్న ఈ మాయదారి కరోనా నుండి మనల్ని మనమే కాపాడుకుందాం. క‌రోనా ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సోకేలా మ‌నం ఉప‌యోగ‌ప‌డ‌వ‌ద్దు. అలాంటి త‌ప్పు చేయ‌వ‌ద్దు. అవును మ‌నం త‌ప్పు చేయం. ఇకెందుకు భ‌యం.

ప్రభుత్వం చెప్పినట్టు ఇంట్లో ఉండి మనకు మనమే రక్షణగా ఉందాం. అలసత్వం వద్దు ప్రపంచం మొత్తాన్ని చూసాము ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నారో. మన జిల్లాకి, మన రాష్ట్రానికి, మన దేశానికి అలాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త తీసుకుంటున్న ప్రభుత్వనికి సహకరిద్దాం.

ఢిల్లీలో ఓ మహిళ ద్వారా ఓ డాక్టర్ కు కరోనా వైరస్ సోకింది. టెస్టులు చేయగా పాజిటివ్ గా తేలింది. అయితే ఈ డాక్టర్ కి కరోనా సోకిన తరువాత కూడా సుమారుగా 900 మందికి పైగా ట్రీట్ మెంట్ చేసినట్టు తెలియడంతో వారందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు జరపగా - వీరికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. దీన్ని నుంచి మనం తెలుసుకోవాల్సిందేమిటి?

మిల్లి సెకెన్ లో అంటుకోవడానికి నీ చుట్టూ కరోనావైరస్ ఉంది. ఏమీ అవ్వదు అనుకుంటే నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. మనకంటే ఎంతో.. ఎంతెంతో డెవలప్‌ అయిన దేశాల్లో మరణమృదంగం మోగుతోంది. సామాన్యుల నుండి అద్ధ్యక్షులు, అపర కుబేరులు, సెలబ్రెటీలు, వీఐపీలు అందరూ కరోనా బారిన పడ్డారు.