కాంగ్రెస్ జగన్ ను అందుకే కలుపుకోనుందా?


రాష్ట్ర విభజన జరిగిన తరువాత కాంగ్రెస్ పార్టీకి అసలు భవిష్యత్ లేకుండా అయింది. ఏదో అప్పుడప్పుడు కొంత మంది నాయకులు హడావుడి చేయడం వల్ల కాంగ్రస్ పార్టీ ఉందని గుర్తించే రోజుల్లో ఉన్నారు. కాస్తో కూస్తో తెంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉందని విషయం తెలుస్తోంది.. ఇక ఆంధ్రాలో అయితే చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. అదేంటంటే తన తండ్రి చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీ పెట్టి ఏపీలో ప్రతిపక్షనేతగా ఎదిగిన జగన్ తో చేతులు కలిపి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా జగన్ తో విభేధాలు ఉన్నప్పటికీ ఏపీ ప్రత్యేక హోదా విషయంలో మాత్రం కాంగ్రెస్ జగన్ తో కలిసి పనిచేయాలని యోచిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్ కు మద్దతు తెలుపుతున్నామని ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ జయ్ సింగ్ అన్నారు. ఈ విషయంలో కూడా జగన్, కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకొని పోవాలని.. అప్పుడే తనకు ఫుల్ సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నార.

అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఒక్క విషయంలోనే కాకుండా ఇంకా ఇతర అంశాలపై కూడా జగన్ వినియోగించుకోవాలని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జనాకర్షణ కలిగిన నేతలెవరూ లేరూ.. ఏదో చిరంజీవి వల్ల.. తన అభిమానుల వల్ల నెట్టుకురావచ్చు అని చూసిన కాంగ్రెస్ పార్టీకి అది కూడా కుదరలేదు. ఎందుకంటే ప్రస్తుతం చిరంజీవి తన 150 వ సినిమా మీద పెట్టిన దృష్టి రాజకీయాల మీద పెట్టలేకపోవడం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జగన్ ను కలుపుకొని పోతే మీడియా దృష్టిని ఆకర్షింటవచ్చు.. తమ పార్టీ చేసే నిరసనలకు ఆదరణ లభించి అలాగైనా ప్రజలలోకి వెళ్లోచ్చు అని స్కెచ్ వేస్తుంది. ఇంతా ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ పార్టి ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే అందుకు ముందు జగన్ ఒప్పుకుంటారో లేదో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu