"నా ఇటుక.. నా అమరావతి".. వాట్ యాన్ ఐడియా బాబు
posted on Oct 16, 2015 4:12PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన "నా ఇటుక.. నా అమరావతి" వెబ్ సైట్ కు తక్కువ కాలంలో ఎక్కువ ఆదరణ పొందింది. ఏపీ నూతన రాజధాని నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలని.. ప్రతి ఒక్కరూ రాజధానికోసం సహకరించాలని చంద్రబాబు ఎప్పటి నుండో పిలుపునిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన "నా ఇటుక.. నా అమరావతి" పేరు మీద http://amaravati.gov.in/index.aspx ఒక వెబ్ సైట్ ను స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరూ ఒక్క ఇటుకకైనా తమ వంతుగా దానం చేయాలని కోరారు. దీంతో ఇప్పుడు ఈ సైట్లో విరాళాల జోరు ఎక్కువైంది. ఉదయం 11 గంటల సమయానికి ఈ వెబ్ సైట్ ద్వారా 4937 మంది 440392 ఇటుకల్ని ఇచ్చారు. అంతేకాదు చంద్రబాబు ఈ సైట్ డిజైనింగ్ కూడా చాలా ఆసక్తికరంగా చేశారు. ఇటుకలు విరాళంగా ఇచ్చే వారి పేర్లు.. ఫోటోలు కూడా ప్రచురించేలా.. అంతేకాదు విరాళం ఇచ్చిన వెంటనే తాజాగా విరాళం ఇచ్చిన వారి పేర్లు అంటూ వారి పేర్లు స్క్రోలింగ్ అవడం ఇవన్నీ కూడా ఈ సైట్ ను ఆకర్షించేలా చేస్తున్నాయి.
కాగా ఇప్పటివరకూ అత్యధికంగా ఏపీ క్రెడాయ్ 52200 ఇటుకల్ని విరాళంగా ఇచ్చింది. ఆ తరువాత ఆలూరు శివరామ ప్రసాద్ అనే వ్యక్తి మాత్రం 10116 ఇటుకలు ఇచ్చి క్రెడాయ్ తర్వాతి స్థానంలో నిలిచారు. ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర పేరిట 5558 ఇటుకలు.. డాక్టర్ శ్రీనివాస్ గుళ్లపల్లి 5000 ఇటుకల్ని విరాళంగా ఇచ్చారు. మొత్తానికి చంద్రబాబు ఐడియా సూపర్ గా వర్కవుట్ అయినట్టే కనిపిస్తుంది.