ఆ జైల్లో వందలాది శవాలు!

 

కొలంబియాలోని బొగొటా అనే జైలు అది. ఖూనీకోరులకీ, మత్తుమందు వ్యాపారస్తులకీ ఆ జైలు పెట్టింది పేరు. కానీ తమ దేశంలో అలాంటి వాళ్లు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో కొలంబియా పది మంది నేరస్తులని ఉంచాల్సిన చోట 20మందిని నిర్బంధించింది. ఇలాంటి జైళ్లలో కొట్లాడుకోవడం, దొమ్మీలు జరగడం సర్వసాధారణం. కానీ ఇటీవల బొగొటా జైలులో వెలికి చూస్తున్న వాస్తవాలు చూస్తుంటే కరుడుగట్టిన నేరస్తులకి సైతం గుండె కరిగిపోతోంది. బొగొటా జైలు మురుగుకాల్వలలో ఒకటి కాదు, పది కాదు వందకి పైగా శవాలు బయటపడుతున్నాయి.

 

 

పోనీ వారంతా జైళ్లోనివారా అంటే అదీ కాదు. జైళ్లో ఉన్న తమ బంధువులను చూడటానికి వచ్చినవారు కూడా శవాలుగా తేలుతున్నారు. ఇవన్నీ కేవలం 1990-2001 మధ్యలో జరిగిన హత్యలుగా భావిస్తున్నారు అధికారులు. జైలు అధికారులు, కొందరు పైశాచికమైన నేరస్తులు కలిసి చేసిన ఘోరంగా వీటిని భావిస్తున్నారు. కొలంబియాలో ఉన్న ప్రభుత్వానికి స్థిరత్వం లేకపోవడంతో ఏం చేసినా ఎవరూ పట్టించుకోరనుకుని ఇలాంటి అకృత్యాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి బయటపడిన మృతదేహాలను గుర్తుపట్టే పరిస్థితి లేదు. కనీసం ఆ హత్యలకు కారణం అయినవారినన్నా గుర్తించేందుకు పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu