కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ
posted on Sep 9, 2025 9:48PM

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు. రీజినల్ రింగు రోడ్డుకు (నార్త్ పార్ట్) సంబంధించి 90 శాతం భూ సేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి కేంద్ర ఆర్థిక, కేబినెట్ అనుమతులు ఇప్పించాలని గడ్కరీకి విన్నవించారు. రావిర్యాల - ఆమన్‌గల్ - మన్ననూర్ రహదారిని నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారిగా నిర్మించాలని సూచించారు.
అలాగే, మన్ననూర్ - శ్రీశైలం (ఎన్‌హెచ్ 765) నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతించాలని కేంద్ర మంత్రి గడ్కరీని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ - మంచిర్యాల మధ్య నూతన గ్రీన్‌ఫీల్డ్ రహదారిని జాతీయ రహదారిగా మంజూరు చేయాలని విన్నవించారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారికి అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు