సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్
posted on Jul 31, 2025 5:10PM
.webp)
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన రెండు కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ మరియు కౌడిపల్లి పీఎస్ లో నమోదైన కేసులను కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నెల 26న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. 2021లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలు, నిరసనల సమయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ స్టేట్ చీఫ్‌గా ఉన్న సమయంలో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి.
ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ ర్యాలీలు నిర్వహించగా.. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారని, అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహించారని ఫిర్యాదులు అందాయి. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 26న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ నేరుగా విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వ వాదనలతో పాటు రేవంత్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు కేసును 31వ తేదీకి వాయిదా వేయగా తగిన ఆధారాలు సమర్పించడంతో రెండు కేసులను న్యాయస్థానం నేడు కొట్టివేసింది.