దారి తప్పిన కేసీఆర్ కాన్వాయ్
posted on Oct 15, 2014 6:07PM
.jpg)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ దారి తప్పింది. కాన్వాయ్‌లోని కార్లు ఎటు పడితే అటు వెళ్ళిపోయాయి. హుస్సేన్ సాగర్ పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌లో గందరగోళం చోటు చేసుకుంది. తన పర్యటనలో భాగంగా కేసీఆర్ ట్యాంక్ బండ్, నెక్లేస్ రోడ్డు, జల విహార్, సుందరయ్య పార్కులను పరిశీలించారు. అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో సీఎం వాహనానికి ముందు వెళ్తున్న ఎస్కార్ట్ వాహనాలు హఠాత్తుగా ఎడమ వైపుకు తిరిగి మినిస్టర్ రోడ్డులోకి వెళ్ళిపోయాయి. సీఎం కేసీఆర్ వాహనం మాత్రం నేరుగా వెళ్ళి బుద్ధ భవన్ దగ్గర యు టర్న్ తీసుకుంది. ఎస్టార్ట్ సిబ్బంది తేరుకుని సీఎం కాన్వాయ్‌ని అనుసరించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే కేసీఆర్ వాహనం ముందుకు వెళ్ళిపోయింది. దాంతో ముఖ్యమంత్రి వాహనం ముందు వుండాల్సిన ఎస్కార్ట్ వాహనాలు ఆయన కారును అనుసరించాయి.