1000కోట్లు అడ్వాన్స్‌గా ఇవ్వండి.. చంద్రబాబు
posted on Nov 19, 2015 4:18PM

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా చాలా నష్టం జరిగింది. అనేక చెరువులు కట్టలు తెగిపోయి.. రోడ్లు విరిగిపోయి వరదలు వచ్చి చాలా ఆస్తి నష్టం జరిగింది. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఏరియల్ సర్వే కూడా చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి ఓ లేఖ రాసినట్టు తెలుస్తోంది. అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైందని.. వరదల కారణంగా జరిగిన నష్టనివారణ, పునరావాసం, పునర్నిర్మాణం పనులకు రూ.1000కోట్లు అడ్వాన్స్‌గా విడుదల చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు లేఖలు పంపించారు. మొత్తంగా రూ.3వేల కోట్ల నష్టం జరిగినట్టు ఉందని.. అంచనాలు వేసి లెక్కలు కట్టిన తర్వాత తుది నివేదికను పంపుతామని.. ప్రస్తుతానికి మొదటిగా వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరారు.