గాడిదకు గడ్డేసి.. మోడీని అడిగితే ఎలా? కిషన్ రెడ్డి..
posted on Nov 19, 2015 3:47PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల తూటాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యర్ధులను ఏకిపారేయడంలో తన స్టైలే వేరు. తిట్లతో పాటు సామెతలని కూడా యాడ్ చేస్తూ చాలా గమ్మత్తుగా తిడుతుంటారు. అలా కేసీఆర్ తరుచూ వాడే సామెతే (గాడిదకు గడ్డేసి… ఆవును పాలు ఇవ్వమంటే ఇస్తుందా ?) ఇప్పుడు కేసీఆర్ పై ప్రయాగించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వరంగల్ ఉపఎన్నికల ప్రచార నేపథ్యంలో కేసీఆర్ అందరిని విమర్శించినట్టే కిషన్ రెడ్డిని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ సమయంలో రాజీనామా చేయమని కిషన్ రెడ్డిని అడిగితే దద్దమ్మలా పారిపోయాడని అన్నారు. అంతే దీనికి కిషన్ రెడ్డి కూడా కేసీఆర్ స్టైల్ లోనే ఆయనకు ధీటుగా సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందని నేతలు మోడీని విమర్శిస్తున్న నేపథ్యంలో.. గాడిదకు గడ్డేసి.. మోడీని అడిగితే ఏం లాభం అంటూ కేసీఆర్ ను గాడిద అనేశారు కిషన్ రెడ్డి. అంతేకాదు వరంగల్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతుందేమో అని భయపడే ఇంకా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. మొత్తానికి సైలెంట్ గా ఉండే కిషన్ రెడ్డి కేసీఆర్ స్టైల్లోనే కేసీఆర్ ను గాడిద అని విమర్శించడంతో అందరూ షాకవుతున్నారు.