ఈసారి మోడీకి ఆ అవకాశం దక్కతుందా?

టైమ్స్ పత్రిక ప్రతి ఏటా 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' ను ఎంపిక చేస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి 2015 ఏడాదికి 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' రేసులో భారత్ ప్రధాని నరేంద్రమోడీతోపాటు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారత సంతతికి చెందిన గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు. అంతేకాదు వారు ఈ పత్రిక వారి గురించి కొంచెం భ్రీఫింగ్ కూడా ఇచ్చింది.

భారత ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు చేస్తూ.. విదేశీయులతో మంచి సత్సంబంధాలు ఏర్పరుచుకుంటూ అక్కడ పెట్టుబడులతో ఆధునీకరించే దిశగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కాని ఈమధ్య దేశంలో మత పరమైన విమర్శలు ఎక్కవయ్యానని.. అంతేకాదు.. బీహార్ ఎన్నికల ప్రభావం కూడా కొంత పడుతుందని పేర్కొన్నారు.

ఇక అంబానీ టెలికామ్ సంస్థల నుంచి ప్రపంచంలోనే అతి పెద్దదైన ముడి చమురు రిఫైనరీ కలిగిన వ్యక్తి అని టైమ్ తెలిపింది.

 భారత సంతతికి చెందిన గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ పదకొండేళ్లు గూగుల్ లో పని చేసి ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ కుడిభుజంగా పేరొంది ప్రస్తుతం ఆ సంస్థలో అత్యున్నత స్థానంలో ఉన్నాడని టైమ్ పేర్కొంది.

కాగా ఈరేసులో రష్యా ప్రధాని పుతిన్ కూడా ఉన్నారు. కాకపోతే ఈయన మోడీ కంటే కొంచెం వెనుకలోనే ఉన్నారని తెలుస్తోంది. మోడీకి ఇంతవరకూ 1.3 శాతం ఓట్లు రాగా పిచాయ్ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు కూడా అదే శాతం ఓట్లు వచ్చాయి. అంబానీకి అతి తక్కువగా 0.2 శాతం ఓట్లు వచ్చాయి. మరి ఈ సారి 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' మోడీని వరిస్తుందో లేదో తెలియాలంటే వచ్చేనెల వరకూ ఆగాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu