చంద్రబాబు నిర్ణయమే లోకేశ్ తీసుకున్నాడు..
posted on Sep 25, 2015 4:25PM

టీడీడీ యువనేత.. పార్టీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేశ్ కూడా ఇప్పుడు తండ్రి చంద్రబాబు బాటలోనే నడవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రం విడిపోయన తరువాత సీఎం చంద్రబాబు మొదట్లో హైదరాబాద్ నుండే పాలనా కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే అది కష్టమైని భావించి విజయవాడ నుండే తన పార్టీ కలాపాలు చూసుకోవాలని భావించి వారంలో మూడురోజులు విజయవాడలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మూడురోజులు కాదు అన్ని రోజులు అక్కడే ఉంటున్నారు.. ఎప్పుడో అవసరమైతే తప్ప హైదరాబాద్ రావడంలేదు. ఇప్పుడు లోకేశ్ కూడా విజయవాడలోనే మూడు రోజులు విజయవాడలోనే ఉండాలని నిర్ణయించుకున్నారట. మీరు కూడా విజయవాడలో ఉంటే బావుంటుందని పార్టీలో ఉన్న పలువురు నేతలు లోకేశ్ ను అడగటంతో ఆయన కూడా విజయవాడలో ఉండాలని డిసైడయ్యారట. అయితే లోకేశ్ గా కూడా కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నారట. విజయవాడలోనే ఉండి కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటూ... ఒకవేళ తనకు ఏదైనా డౌట్ వచ్చినా తన తండ్రి చంద్రబాబు ఎలాగూ పక్కనే ఉంటారు కాబట్టి సలహాలు సూచనలు తీసుకోవచ్చనే ఆలోచనతోనే నిర్ణయం తీసుకున్నారట. మొత్తానికి తండ్రి.. కొడుకులు ఇద్దురూ ఒకే దగ్గర ఉండి పాలనా కార్యక్రమాలు చూసుకోవడం మంచి పరిణామమే.