ఒక్కరోజైనా జైల్లో చూడాలనుకున్నాడు జగన్..!
posted on Sep 25, 2015 5:00PM
.jpg)
తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై దుమ్మెత్తిపోశారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. జగన్ ఇద్దరూ ఒకటే అని.. అందుకే కేసీఆర్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా.. ఏపీ ప్రభుత్వంపై సమస్యలు సృష్టిస్తున్నా జగన్ పట్టించుకోకుండా ఉండటమే దీనికి నిదర్శనమని అన్నారు. అలాకాదంటే కేసీఆర్ పై పోరాడటానికి జగన్ సిద్దమా అని సవాల్ విసిరారు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం డిమాండ్ చేస్తూ జగన్ చేస్తున్నా దీక్ష ఒట్టి ప్రచారం కోసమే అని.. కాని ప్రజలు దీన్ని నమ్మరని అన్నారు. ఒకవేళ తన అక్రమాస్తులను ప్రజలకు ఇచ్చి చేస్తే తన దీక్షను ప్రజలను నమ్ముతారని ఎద్దేవచేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అడగకుండా చంద్రబాబును ఆడిపోసుకుంటే ఏం లాభం..ప్రతిఒక్క విషయానికి చంద్రబాబును అనడం ఆనవాయితీ అయిపోయిందని అన్నారు. ఈనాడు అధిపతి రామోజీరావును ఒక్కరోజైనా జైలులో ఉంచాలని అనాడు వైఎస్ జగన్ అనుకున్నారని.. అలాంటిది ఇప్పుడు తాను రామోజీరావును ఎందుకు కలిశారు.. కలవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.