అసెంబ్లీలోనే ఉండరు.. ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు
posted on Sep 25, 2015 3:54PM

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కమ్యూనిస్ట్ ల వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై వారు లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. కమ్యూనిస్టులకు అసలు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు.. అలాంటిది వారు కూడా ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నారని ఎద్దేవ చేశారు. ఏదో మీడియాలో కనిపించడం కోసం ప్రతి చిన్న విషయానికి సంఘర్షణ చేస్తే కాదు.. సంయమనంతో ఉంటేనే ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని హితవు పలికారు. ఈసందర్భంగా ఆయన దీన్‌దయాల్ ను గుర్తు చేశారు. దీన్‌దయాల్ ఓ స్వప్నికుడు, ఆయన జీవితం ఆదర్శనీయమని..జాతి పునరుజ్జీవనానికి దీన్‌దయాల్ ఆనాడే బీజం వేశారని అన్నారు. సిద్ధాంతపరమైన ఓటమిని కమ్యూనిస్టులు ఎప్పుడూ అంగీకరించడంలేదని దుయ్యబట్టారు. కమ్యూనిస్టుల ప్రభావం పరిమితమని.. కానీ వారికి ప్రచారం అపరిమితమని చెప్పారు. ప్రతిపక్షాలు చిన్న విషయాన్ని పెద్దగా చేస్తూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.