ముఖ్యమంత్రికి ఎన్నికల సంఘం నోటీసులు..

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీకి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు పంపించింది. అనంత్‌నాగ్ నియోజకవర్గం నుంచి మహబూబా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 1న నామినేషన్ దాఖలు చేసేందుకు కార్లో వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ప్రయాణించిన కారులో జాతీయ జెండాలతో పాటు రాష్ట్ర జెండాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అది చట్ట విరుద్ధం కావడంతో మహబూబాకు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ శాంతమను నోటీసులు జారీ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu