చర్లపల్లి డ్రగ్స్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు
posted on Sep 7, 2025 6:15PM

చర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర తానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ నగరానికి వచ్చే చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎండి కంపెనీపై రైడ్ చేసి 12 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి... కొన్ని కోట్ల విలువ చేసే డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో కంపెనీ యజమాని శ్రీనివాస్ విజయ్ ఓలేటినీ పోలీసులు అరెస్టు చేసి అతని చరిత్ర పై ఆరాతీస్తున్నారు. ఎండి డ్రగ్స్ కంపెనీ యజమాని విజయ్ ఓలేటి గతంలో జీవికే బయో సైన్స్ లో 12 సంవత్స రాల పాటు కెమికల్ అనాలసిస్‌గా పనిచేశాడు.
ఐదు సంవత్సరాల క్రితం జీవికే బయోసైన్స్ నుంచి బయటికి వచ్చిన విజయ్ ఓలేటి కెమికల్ తయారీ కంపెనీ తో పాటు సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. అయితే సింథటిక్ డ్రగ్స్ తయారు చేయడం లో విజయ్ ఓలేటి దిట్ట...మహారాష్ట్ర చెందిన తానాజీ తో కలిసి విజయ్ వాగ్దేవి ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసి... చర్లపల్లి లో డ్రగ్స్ రా మెటీరియల్ తయారు చేసి నాచారంలో డ్రగ్స్ తయారు చేసేవాడు..తానాజీ తో కలిసి విజయ్ ఐదేళ్లుగా సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తు న్నాడు. అయితే విజయ్ అతి కొద్ది మంది సిబ్బంది తో మాత్రమే కంపెనీని నడపించడమే కాకుండా అది కూడా కేవలం రాత్రిపూట మాత్రమే నడిపేవారు.
ఆ విధంగా తయారు చేసిన సింథటిక్ డ్రగ్స్ ను పోలీసుల కంట పడకుండా వివిధ మార్గాల ద్వారా మన దేశం తో పాటు విదేశా లకు సరఫరా చేసేవాడు. విజయ్ ముందుగా అత్యంత ప్రమాదక రమైన మెఫీడిన్ డ్రగ్ తయారు చేశాడు. అనంతరం మెఫీడిన్ డ్రగ్ నుంచి ఎక్సెసి, మోలీ ,xtc, MDMA మొదలగు నాలుగు రకాల డ్రగ్స్ లను తయారు చేసి ముంబై, గోవా, బెంగళూరులకు రహస్యం గా వివిధ వస్తువుల మాటున తరలించేవారు. అయితే ఈ విధంగా తయారు చేసిన డ్రగ్స్ ని దేశ విదేశా లకు సరఫరా చేసేందుకు విజయ్ ఒక గ్యాంగ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
అంతేకాకుండా డ్రగ్స్ కంపెనీ యజమాని విజయ్ కి ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా తో కూడా సంబంధాలు ఉన్నట్లుగా పోలీ సులు గుర్తించారు. ఈ విధంగా తయారు చేసిన డ్రగ్స్ ని విజయ్ మొదటగా హైదరా బాదులో అమ్మి అనంతరం విదేశాలకు సరఫరా చేసేవాడు. ప్రతిసారి ఐదు కేజీల చొప్పున మెపిడ్రిన్ అమ్మే వాడు. ఒక్కొక్క కేజీ 50 లక్షల రూపా యల చొప్పున అమ్మేవాడు. ఈ విధంగా నాచారం, చర్లపల్లిలో డ్రగ్స్ తయారుచేసి దర్జాగా విక్ర యాలు చేసేవాడు. ప్రతిసారి డ్రగ్స్ కు 50 లక్షల తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి ఆధారాలు సేకరించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ నగరానికి వచ్చి నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎండి డ్రగ్స్ కంపెనీ పై సోదాలు చేసి... కంపెనీ యజమాని విజయ్ ఓలేటి, తానాజీ లతో పాటు మరో 10 మందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
అయితే గతంలో డ్రగ్స్ తయారు చేస్తు న్నట్లుగా గుర్తించిన తెలంగాణ నార్కో టిక్ బృందం డ్రగ్స్ తయారీపై విజయ్ కి నోటీ సులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ విష యంపై విజయ్ కోర్టు ను ఆశ్రయించారు. అయితే బంగ్లాదేశ్ కి చెందిన ఓ మహిళ పట్టుబ డడంతో హైదరా బాద్ చర్లపల్లి లో డ్రగ్స్ కంపెనీ వ్యవహారం కాస్త బట్టబయలు అయింది. చర్ల పల్లి వాగ్దేవి ల్యాబ్స్ లో రూ.11. 58 కోట్లు విలువైన మెఫిడ్రిన్ తయారీ చేస్తున్నారు. 35,500 లీటర్లు రసాయ నాలు, 950 కిలోల ముడి పదార్థాలు స్వాదీనం చేసుకున్నారు. వాగ్దేవి ల్యాబ్స్ యజమాని శ్రీనివాస్ విజయ్, సహాయకుడు తానాజీ పండరినాథ్ అరెస్ట్ చేసి...ఇద్దరిని నిందితులను ట్రాన్సిట్ వారెంట్ తో ముంబై కి తరలించారు.