సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్స్‌ వ్యవస్థాపకుడు మోహనరావు కన్నుమూత

 

చందన బ్రదర్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు  చందన మోహనరావు (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలో ఇవాళ ఉదయం మరణించారు. ఆయన మృతి పట్ల రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు సంతాపం తెలిపారు.

వ్యాపార రంగంలో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ.. మోహనరావు అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో.. నాణ్యమైన వస్త్రాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. సీఎంఆర్ మాల్స్‌ వస్త్రాలు, జ్యువెలరీ వంటి పలు విభాగాల్లో విస్తృతంగా స్థాపించబడింది. సాధారణ వినియోగదారుల నుండి ప్రముఖుల వరకు అందరికీ ఇష్టమైన బ్రాండ్‌గా అవి నిలిచాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu