కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం : డీజీపీ

 

కానిస్టేబుల్ హత్య కేసు  ప్రమోద్‌ కేసులో నిందితుడు షేక్ రియాజ్  ఎన్కౌంటర్ పై స్పందించిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పదించారు. తప్పించుకొని పారిపోతూ పోలీసులపై మరోసారి దాడికి తెగబడిన రియాజ్ ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారని డీజీపీ పేర్కొన్నారు. పోలీసుల దగ్గరున్న వెపన్ తీసుకొని కాల్పులకి ప్రయ త్నించాడు. మరోసారి కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు చేశారు. పోలీసు జరిపిన ఎదురుకాల్పులో రియాజ్ చనిపోయాడని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. 

నిన్న రియాజ్ ని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ఆసిఫ్ పై దాడి చేశాడు. ఇవాళ మరొక కానిస్టేబుల్ ని గాయపరిచి పారిపో యేందుకు యత్నిం చాడు. బాత్రూం కోసం వెళ్లి తిరిగి వస్తూ దాడికి తెగబడిన రియాజ్ పోలీసుల దగ్గరున్న వెపన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులపై వేపంతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే మరో కానిస్టేబుల్ రియాజ్ పై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని డిజిపి శివధర్ రెడ్డి వెల్లడించారు.

కరడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన  పోలీస్ కానిస్టేబుల్, అమరుడు ఎంపల్లి ప్రమోద్ కుమార్ కు పోలీసు శాఖ తరుపున ఘన నివాళులు  అర్పించారమని పోలీస్ బాస్ పేర్కొన్నారు. తెలంగాణ లో లా అండ్ ఆర్డర్ ను పూర్తి స్థాయిలో కాపాడేందుకు తెలంగాణ పోలీసు శాఖ నిబద్దతతో ఉంది. ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణచివేస్తామని డీజీపీ తెలిపారు. భర్త ప్రమోద్ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం, పోలీసు శాఖ పూర్తి స్తాయిలో అండగా ఉంటామని పేర్కొన్నారు.

 GO Rt No. 411 ప్రకారం ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీ తో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, GO 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు, అలాగే పోలీస్ భద్రత సంక్షేమం నుండి రూ.16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుండి రూ.8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటాం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పో యిన వారికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరుపున నా నివాళి అర్పిస్తు న్నానని తెలంగాణ డీజీపీ బీ.శివధర్ రెడ్డి వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu