బిగ్ బ్రేకింగ్: కేసీఆర్ కు బిగ్ షాక్.. దళిత బంధుకు బ్రేక్.. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాకిచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నికల దృష్ట్యా తెలంగాణలోని హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. దళితబంధు అమలు ఆపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈసీ లేఖ రాసింది. ఈ లేఖతో హుజూరాబాద్‌లో దళితబంధుకు బ్రేక్‌ పడింది. 

హుజురాబాద్‌ ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పలు లేఖలు అందాయి. అన్ని పార్టీల ఫిర్యాదులన్నీ కలిపి ఒక లేఖగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందింది. అదే ఈ లేఖ నెం.3077/EL ECSA/A!/2021/43 తెలంగాణ ఈసీ నుంచి అందిన నివేదిక ఆధారంగా దళిత బంధు నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల కోడ్‌ అమలులో ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యథావిథిగా కొనసాగించవచ్చని సూచించింది.

Related Segment News