ఏపీలో పాలన భేష్.. జస్టిస్ ఇండియా ర్యాంకింగ్ లో ఏపీ @2

జగన్  హయాంలో   అరాచక, ప్రతీకార, దౌర్జన్య, దుర్మార్గ పాలన సాగిందన్న ఆరోపణలు వాస్తవమేనని తాజాగా ఇండియా జస్టిస్ రిపోర్ట్ తేల్చేసింది. జగన్ హయాంలో పోలీసు శాఖను ప్రైవేటు సైన్యంగా మార్చుకుని ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను లక్ష్యం వేధింపులకు పాల్పడిన ఘటనలపై అప్పట్లోనే తెలుగుదేశం, జనసేనలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. వాటిని కూడా పాశవికంగా అణచివేశారు అది వేరే సంగతి. అయితే జగన్ హయాంలో ప్రతీకార చర్యలు, ప్రత్యర్థులపై దాడులు, వేధింపులే పాలనగా సాగిందన్న ఆరోపణలు, విమర్శలూ వాస్తవమేనని ఇండియా జస్టిస్ తాజా నివేదిక తేటతెల్లం చేసింది. 

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి, నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పోలీసులు వ్యవహార తీరులో మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  శాంతి భద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. పాలనలో చట్టబద్ధత, జవాబుదారీ తనం పెరిగాయి. ఇదే విషయాన్ని ఇండియా జస్టిస్ తాజా నివేదికలో పేర్కొంది.  

శాంతి భద్రతల పరిస్థితి విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పోలీసింగ్, న్యాయవ్యవస్థ పనితీరు, చట్టబద్ధ పాలన, సామాజిక పరిస్థితులు.. ఇలా అనేక అంశాలను పరిగణనలోనికి తీసుకుని ఇండియా జస్టిస్ సంస్థ రాష్ట్రాలకు ర్యాంకింగ్ కు కేటాయిస్తుంది.  2019, 2024 మధ్య కాలంలో ఇండియా జస్టిస్ ర్యాంకింగ్ లలో ఆంధ్రప్రదేశ్ దిగువ నుంచి తొలి స్థానానికి పోటీ పడుతూ ఉండేది. అటువంటిది రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యిందో లేదో.. ఏపీ ర్యాంకింగ్ ఒక్కసారిగా ఎగబాకి దేశంలోనే రెండో స్థానానికి చేరుకుంది. ఈ  జస్టిస్ ఇండియా ర్యాంకింగ్స్ లో కర్నాటక తొలి స్థానంలో ఉండగా, ఏపీ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu