సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క
posted on Aug 9, 2025 2:31PM

రక్షాబంధన్ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి మహిళా మంత్రులు రాఖీలు కట్టారు. మంత్రులు సీతక్క, కొండాసురేఖ సహా పలువురు రాఖీ కట్టారు. భారీగా తరలివచ్చిన ఆడపడుచులు ముఖ్యమంత్రికి రాఖీ కట్టేందుకు పోటీ పడ్డారు. అనంతరం మిఠాయి తినిపించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు గీతా రెడ్డి రాఖీ కట్టారు.
డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితరులకు మంత్రి సీతక్క రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. అటు హీరో బాలయ్యకు ఆయన సోదరి ఎంపీ పురందశ్వరి రాఖీ కట్టి స్వీట్ తినిపించారు.మంత్రి సీతక్క నా అనుబంధం… అక్షరాలతో రచించలేనిది…మాటలతో నిర్వచించలేనిది…ప్రతి రాఖీ పౌర్ణమి నాడు…ఆ బంధం మరింతగా వికసిస్తునే ఉంటుంది అని సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా తెలిపారు.