పెట్టుబడులు, ఉద్యోగ ఉఫాధి అవకాశాలే లక్ష్యంగా స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు!

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. వచ్చే ఐదేళ్ల కాలానికి కొత్త  అంతరిక్ష విధానాన్ని ప్రకటించిన చంద్రబాబు సర్కార్.. ఈ విధానం అమలుకు ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది.  స్పేస్ పాలసీ ద్వారా పెట్టుబడుల ఆకర్షణ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్, అలాగే స్టార్టప్ లను నిధులు వంటివి లక్ష్యాలుగా పెట్టుకుంది. ఇందు కోసం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లను భాగస్వాములుగా ఆహ్వానించనుంది. ఇక స్పేస్ సిటీ కార్పొరేషన్ ద్వారా అంతరిక్ష ప్రాజెక్టుల అమలు పర్యవేక్షించనుంది.  సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో  స్పేస్ సిటీలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన ప్రభుత్వం, ఇందు కోసం అవసరమైన భూకేటాయింపులపై దృష్టి సారించింది.

 భూ కేటాయింపులు మరియు దరఖాస్తుల పరిశీలన వంటి ప్రక్రియల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది.  అంతరిక్ష రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడంతో పాటు పాతిక వేల కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించారు.  ఈ లక్ష్యం నెరవేరితో   ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు.