హైపర్ టెన్షన్ ను మ్యానేజ్ చేసే క్యారెట్..!

 

కూరగాయలలో అందరూ ఇష్టపడి అన్నిటిలోనూ వాడుకునే తియ్యటి క్యారెట్ లో ఉన్నన్ని గుణాలు మరే కూరగాయలలోను కనిపించవు అంటే అతిశయోక్తి కాదు. మన దైనందిన ఆహారపు అలవాట్లలలో క్యారెట్ ను బాగా ఉపయోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. క్యారెట్ వాడకం  ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుందని ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో ఉపయోగ పడుతుందని  వైద్యులు చెబుతారు. ఈ క్యారెట్‌లోనున్న గుణాలు మరెందులోను ఉండవంటున్నారు వైద్యులు.

 

సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతంమంది ఇష్టపడరు. మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చి గా తినేందుకు ఇష్టపడతారే కానీ, వండితే మాత్రం ఇష్టపడరు. క్యారెట్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలును కల్గిస్తాయనీ, ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు. వండితే తినేందుకు ఇష్టపడని ఈ క్యారెట్లను సలాడ్ల రూపంలోనూ, జ్యూస్‌ల రూపంలోనూ తీసుకోవచ్చుననీ, ఇలా తీసుకున్నట్లయితే మంచి పోషకవిలువలు, ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.

 

క్యారెట్ వినియోగం వల్ల హైపర్ టెన్షన్ ను మ్యానేజ్ చేయవచ్చు. క్యారెట్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎముకల ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. అదే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు సహాయపడుతూ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి క్యారెట్ సహాయపడుతుంది. మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని కాపాడటంలో ప్రముఖ పాత్ర వహించే ఈ క్యారెట్ ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే మనం మన అనారోగ్య సమస్యల నుండి అంత త్వరగా బయట పడవచ్చు..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu