ఆఫ్టర్ బడ్జెట్... కామన్ మ్యాన్ కండీషన్ ఏంటి?
posted on Feb 1, 2017 3:56PM

1. మీ వార్షిక ఆదాయం 3లక్షల కంటే తక్కువైతే ఎలాంటి పన్నూ వుండదు!
2. రెండున్నర లక్షల నుంచి అయిదు లక్షల మద్య సంవత్సర ఆదాయం వున్న వారు ఇక మీద 10 శాతానికి బదులు 5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది!
3. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకి ఆ ఆదాయంపై పన్ను మినహాయింపు!
4. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రూ.20వేల కోట్ల గృహ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. దీని వల్ల మధ్యతరగతి వారి స్వంతింటి కలలు నిజం కానున్నాయి!
5. గృహ రుణాల వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయన్నారు జైట్లీ. దీని వల్ల స్వగృహం చౌకగా మారనుంది!
6. గ్రామీణ నిరుపేదలకు కోటి పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది మోదీ సర్కార్. నీడలేని ఎంతో మందికి ఇది మేలు చేయనుంది!
7. విదేశాలకు వెళ్లే వారు ఇక పై పాస్ పోర్ట్ కార్యాలయాల ముందు క్యూలు కట్టనక్కర్లేదు. పోస్టాఫీసుల్లో కూడా పాస్ పోర్ట్ లు జారీ చేస్తారు!
8. బడ్జెట్ తో పాటూ రైల్వే బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టిన జైట్లీ ఐఆర్ సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి సర్వీస్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేశారు!
9. 500 రైల్వే స్టేషన్లలో దివ్యాంగుల కోసం లిఫ్ట్ , ఎస్కలేటర్ లాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు!
10. వ్యవసాయం పై వరాల జల్లు కురిపించిన ఆర్దిక మంత్రి 10లక్షల కోట్ల వ్యవసాయ ఋణాలు ఇస్తామన్నారు. 60రోజుల్లోగా ఋణం తిరిగి చెల్లిస్తే పూర్తిగా వడ్డీ మాఫీ అయిపోతుంది!
11. సిగరెట్ తాగే వారిపై ఘాటు ప్రభావం చూపింది బడ్జెట్. ఎక్సైజ్ డ్యూటీ 6శాతం పెంపుతో సిగరెట్ ధరలు మరింత వేడెక్కిపోతాయి!
12. సెల్ ఫోన్ తయారీలో వాడే విడి భాగాలపై కస్టమ్స్ లెవీ ఒక శాతం పెంచటంతో ఈ సంవత్సరం మొబైల్స్ కాస్ట్ లీ అవ్వనున్నాయి!