గాంధీజీ చిత్రాలు మార్చొద్దు...

 

భారతదేశ కరెన్సీ మీద మహాత్మాగాంధీ మినహా ఇతర జాతీయ నాయకుల చిత్రాలు ప్రచురించవద్దని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) కమిటీ సూచించింది. దేశ ధార్మిక విలువలను చాటడంలో గాంధీజీకి మరే జాతీయ నాయకుడు సాటిరారని పేర్కొంది. భవిష్యత్తులో ముద్రించే బ్యాంకు నోట్ల డిజైన్ కోసం ప్రభుత్వ సలహా మేరకు 2010 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇప్పుడు నివేదిక సమర్పించింది. కరెన్సీ నోట్ల మీద గాంధీజీ చిత్రాలనే ముద్రించాలని ఆ కమిటీ సూచించిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం నాడు లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu