మాకూ కూడా జీతాలు పెంచాల్సిందే...
posted on Mar 14, 2015 12:07PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక సంస్ధల ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సభ్యులు కూడా తమకు జీతం నెలకు రూ. 3 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. దీనికోసం శనివారం అసెంబ్లీ లాబీలో సంతకాలు చేసి, సంతకాల సేకరణ పత్రాన్ని కేసీఆర్ కు అందజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతభత్యాలను కూడా భారీగా పెంచే ఆలోచనలో ఉంది. ఈ పెంపుదలపై ఈ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం వెల్లడించే అవకాశముంది. రాష్ట్రంలోని మొత్తం 120 మంది ఎమ్మెల్యేలు, 36 మంది ఎమ్మెల్సీలు ఉండగా, ప్రస్తుతం వీరికి రూ. 95 వేల వరకు జీతభత్యాలు అందుతున్నాయి. సీఎం, మంత్రులు, కేబినేట్ హోదా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటరీ సెక్రటరీలు మినహాయిస్తే మిగతా 124 మందికీ రూ. 2 లక్షల చొప్పున జీతాలు చెల్లించాలని భావిస్తోంది.