ట్యూషన్ వాలాతో ప్రేమ.. బీటెక్ అమ్మాయి సూసైడ్..
posted on May 29, 2021 11:16AM
ఈ మధ్య కరోనా కంటే దారుణంగా తయారు అయింది ప్రేమ. ప్రేమ దక్కలేదని కొందరు, ప్రియురాలు మోసం చేసిందని ఇంకొందరు. తల్లి దండ్రులు తమ ప్రేమను అంగీకరించలేదని ఎందరో ప్రేమికులు సూసైడ్ చేసుకుంటున్నారు. తాజగా ఇలాంటి సంఘటనే పట్టణము లో జరిగింది. ఆ విషయాలు పూర్తిగా తెలుసుకుందామా.. ?
అది హైదరాబాద్. బోయినపల్లి. చిన్నతోకట్ట తిరుమల టవర్స్. అక్కడ నివసించే దేవల నర్సింహులు వ్యాపారి. ఆయన కుమార్తె శైలజ (23) బీటెక్ చదువుతోంది. ఎదురు ప్లాట్‌లో నివసించే పవన్ కల్యాణ్ అలియాస్ సన్ని (25) అనే యువకుడు శైలజకు ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వస్తుండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమకు దారితీసింది. ఈ విషయం ఇంట్లో తెలిసి సన్నీ తల్లిదండ్రులు పెళ్లికి నో అన్నారు.
ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం సన్నీ, శైలజను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పగా, ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అతని కుటుంబ సభ్యులతో మాట్లాడగా అందుకు సన్నీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కులం పేరిట దూషించి, చంపేస్తానని బెదిరించారు. కొద్ది రోజుల తర్వాత శైలజను కలిసిన సన్నీ నెల రోజుల్లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు.
అంతే ఆ మాట వినడంతో శైలజ ప్రేమలో పేరుతో మోసపోయానని మనస్థాపానికి గురైన యువతి గురువారం రాత్రి భవనం మూడో అంతస్థు నుంచి దూకింది. వాచ్‌మన్ లక్ష్మయ్య గమనించి నర్సింహులుకు చెప్పాడు. దాంతో వారు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఇన్‌స్పెక్టర్ రవికుమార్ చెప్పారు. బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.