కేరళ మాజీ సీఎం కన్నుమూత

 

కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్చుతానందన్ కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు ఆయన కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆయన 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2019 లో స్ట్రోక్ తో మంచం పట్టిన అచ్యుతానందన్ కు ఇటీవల గుండెపోటు వచ్చి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. 

ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చారు.1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) నుండి బయటకు వెళ్లి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)ను స్థాపించారు. 32 మందిలో అచ్యుతానందన్ మాత్రమే జీవించి ఉన్న నాయకుడు.

ఆయన కేరళ అసెంబ్లీలో మూడుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. చాలా సంవత్సరాలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన 2021 వరకు కేరళ అసెంబ్లీలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు.ఆయన వయసు 101 సంవత్సరాలు. గతేడాది అక్టోబర్‌ 20న ఆయన 101లోకి అడుగుపెట్టారు.