ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం : షర్మిల
posted on Jun 18, 2025 2:48PM
.webp)
బీఆర్‌ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది నిజమని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. గత తెలంగాణ సీఎం, అప్పటి ఏపీ సీఎం కలిసి చేసిన జాయింట్ ఆపరేషనో కాదో తెలియదు. కానీ నా ఫోన్, నా భర్త ఫోన్,నా దగ్గర వాళ్ళ ఫోన్‌లు ట్యాప్ అవుతున్నాయని స్పష్టంగా అర్ధమైందని షర్మిల తెలిపారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చి చెప్పారని ఆమె తెలిపారు. ఓ ఫోన్ కాల్ సంభాషణను కూడా వినిపించారు. ఫోన్ల ట్యాపింగ్‌పై సమగ్ర దర్యాప్తు జరగాలి అని షర్మిల డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని ఆమె తెలిపారు.
ఆనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయింది. ఫోన్ ట్యాపింగ్.. తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఆ ఇద్దరు కలిసి వేసిన స్కెచ్ అని పేర్కొన్నారు.అప్పుడు జగన్, కేసీఆర్ చేసినవి అరాచకాలు. వీరి అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చాల చిన్న విషయం అన్నారు. నేను జగన్‌కు రక్తం పంచుకోని పుట్టిన చెల్లెల్ని. ఆ విషయం మరిచి నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదు అని కుట్ర చేశారని ఏపీ పీసీసీ ఆవేదన వ్యక్తం చేశారు . నా భవిష్యత్తును పాతిపెట్టాలని ఎన్నో చేశారు. నాకు మద్దతు పలికిన వాళ్లను బెదిరించారుని ఆమె అన్నారు.