ఏపీ మంత్రి కన్నబాబు ఇంట తీవ్ర విషాదం

 

ఏపీ వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. 43 ఏళ్ల ఆయన రెండో సోదరుడు సురేష్ ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. మంత్రి కన్నబాబుకు ఇద్దరు సోదరులు కాగా, సురేశ్ పెద్ద తమ్ముడు. విశాఖపట్టణంలో ఈనాడు దినపత్రికకు రిపోర్టర్‌గా పని చేసిన ఆయన తర్వాత పాత్రికేయ వృత్తిని వదిలి రియల్ ఎస్టేట్  వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇక కన్నబాబు రెండో సోదరుడు కల్యాణ్ కృష్ణ సినీ దర్శకుడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘సోగ్గాడే చిన్నినాయన’ వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.  

విశాఖపట్నంలో  సురేష్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బిజినెస్‌ చేస్తున్నారు. అయితే ఆయన విజయవాడలో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో ఆయనను ఆంధ్రా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయనను వైద్యులు కాపాడలేకపోయారు. ఈ నేపధ్యంలో సురేష్ మృతిపట్ల మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, ఎమ్మెల్యేలు ద్వారంపూడి, దొరబాబు, దాడిశెట్టి రాజా, చంటిబాబు తదితరులు సంతాపం తెలిపారు. మంత్రికి ఫోన్ చేసిన వైఎస్ జగన్ ఫోన్ లో పరామర్శించినట్టు సమాచారం.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu