కల ధృవీకరణ కోసం ఇంటింటి సర్వే

కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల ధృవీకరణ పత్రాల జారీ కోసం ఇంటింటి సర్వే చేపసట్టాలని నిర్ణయించింది. అక్టోబర్ 2వ తేదీనాటికి ఈ ఇంటింటి సర్వే పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.  

రియల్ టైం గవర్నెన్స్ సొసైటీతో పాటు పలు శాఖలను కూడా ఈ ఇంటింటి సర్వేలో భాగస్వాములను చేయనుంది.  ఈ సర్వేలో భాగంగా ఇంటింటికి తిరిగి  వివరాలు సేకరిస్తుంది. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వివరాలు మాత్రమే తీసుకునేవారు. అయితే ఈసారి ఓసీల వివరాలు కూడా నమోదు చేస్తారు. ఈ సర్వేను ప్రభుత్వం సుమోటో విధానంలో చేయనుంది. బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ట్యాంపరింగ్  కు ఇసుమంతైనా అవకాశం లేకుండా కుల ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu