ఎస్ బీఐలో భారీ చోరీ.. రూ.38 లక్షల నగదు.. పది కేజీల బంగారం దోపిడీ

ఎస్ బీఐ లో భారీ చోరీ జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా తూముకుంట పారిశ్రామికవాడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఆదివారం(జులై 27) అర్ధరాత్రి దాటిన తరువాత దుండగులు చోరీకి పాల్పడ్డారు.   బ్యాంకు కిటికీ కోసి దాని గుండా లోనికి ప్రవేశించిన దుండగులుకిటికీ కోసి లోనికి వెళ్లి సీసీ కెమెరా వైర్లుకత్తిరించి, లాకర్ తాళాలు బద్దలు కొట్టి చోరీకి పాల్పడ్డారు.

  38 లక్షల రూపాయల నగదు, 10 కేజీల బంగారం దోచుకెళ్లినట్లు నిర్ధారించారు. సోమవారం ఉదయం చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది.   దొంగలు బ్యాంకులోని ఇనుప లాకర్ ప్రధాత తలుపు కూడా పగులగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. ఆదివారం సెలవు కావడంతో.. చోరీ వ్యవహారం సోమవారం (జులై 28) బ్యాంకు తెరిచిన తరువాతే బయటపడింది.   నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక పోలీస్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu