ఏపీ సీఎం రహస్య ఎజెండా? పిల్లల మెదళ్ళలో విష బీజాలా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరు రాజకీయ నాయకుల వంటి రాజకీయ నాయకుడు కాదు. అందరు ముఖ్యమంత్రుల వంటి ముఖ్యమంత్రి కాదు. ఆయనకొక ప్రత్యేక జెండా అజెండా ఉన్నాయి. అందులో ప్రధానమైనది, ప్రభు సేవ, క్రైస్తవ మత ప్రచారం.రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగా మార్చడం, అన్న అనుమానాలు, ఆరోపణలు అది నుంచి ఉన్నాయి, ఒక పెద్దాయన అన్నట్లుగా ఆయనలో ఒక కనిపించని దేవుడున్నాడు. ఆయన వేసే ప్రతి అడుగు ఆ లక్ష్యం, ఆగమ్యం వైపుగా వేసే మరో ముందడుగే అవుతుందని ఆయన అనుచర, సహచరులు అందరు కాకున్నా కొందరు గిట్టిగా నమ్ముతారు. పాస్టర్లకు జీతాలు వంటి ప్రత్యక్ష ప్రోత్సహాకాలు,దేవాలయాలపై దాడులవంటి హిందూ విద్వేష, హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలే కాదు, చాపకిందనీరులా అన్యమత ప్రచారానికి అడ్డుగా నిలుతున్న భాష, సంస్కృతులను ప్రజల మనసుల నుంచి తుడిచెడుకు అవసరమైన అనుకూల పరిస్థితులు కల్పించే దీర్ఘకాల ప్రణాళికలు కూడా ఉన్నయని అంటారు. 

ఇప్పటికీ ప్రాధమిక స్థాయిలో అంగ్ల బోధనను తప్పనిసరి చేసిన జగన్ రీడ్డి ప్రభుత్వం ,తెలుగుకు తిలోదకాలు ఇస్తూ అన్ని ప్రభుత్వ,ప్రైవేటు డిగ్రీ  కళాశాలల్లోనూ తెలుగుకు బదులుగా ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే బోధించాలని జారే చేసిన ఉత్తర్వులు ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తాజా ఉత్తర్వులు అమలు చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాలు రెండూ అందుబాటులో ఉండగా, ఇకపై ఇంగ్లిష్ ఒక్కటే అమలు కానుంది. అంతేకాదు, విద్యార్థులందరూ ఇకపై ఇంగ్లిష్ మీడియంలోనే ప్రవేశాలు పొందాల్సి ఉంటుందని ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతేడాది డిగ్రీ మొదటి సంవత్సరంలో మొత్తం 2,62,805 మంది ప్రవేశాలు పొందగా, వారిలో 25 శాతం మంది అంటే 65,701 మంది మాత్రమే తెలుగు మీడియంలో చేరారు. వీరిలోనూ ఎక్కువమంది గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఉన్నారు. ఇప్పుడు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేయడంతో వీరంతా తెలుగులో చదివే అవకాశాన్ని కోల్పోనున్నారు.

మరోపక్క  ప్రభుత్వ నిర్ణయంపై భాషాభిమానులు, సామాన్య ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు. ఉన్నత విద్యను మాతృభాషలో అభ్యసించేలా నూతన జాతీయ విద్యావిధానం అవకాశం కల్పిస్తోందని, కానీ రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా జరుగుతుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిజానికి, ఇలా చాపకింద నీరులా, మతం మత్తును విద్యార్ధుల మెదళ్ళలో ఎక్కించడం ఇదే మొదలు కాదు ఇదే చివరి ప్రయత్నం కూడా కాదు.. ఎన్ని ఎదురు దెబ్బలు జరిగినా, ప్రయతనాలు మాత్రం ఆగడం లేదు. ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం,. ఎవరో మాట ప్రచారకులు కాదు.. ప్రభుత్వమే చేస్తోందనే ఆరోపణలున్నాయి. ప్రాధమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే బోధన చేయాలనే వివదాస్పద ఉత్తర్వులు మొదలు నిన్న మొన్న వెలుగు చూసిన ఐదవ తరగతి విద్యార్ధులకు అభ్యాస పాఠంగా గుణదల మేరీ మాత చర్చి సందర్శనను చేర్చడం వరకు అనేక ఉదంతాలు ఉన్నాయి. 

ఇలా పిల్లల మెదళ్ళలో మత బీజాలు నాటి  మత మార్పిడులను ప్రోత్సహించే కుట్ర ఇందులో దాగుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే, తెలుగు బాష, తెలుగు సంస్కృతీ మీద, హిందువుల పండగలు, సంప్రదాయాల మీద ప్రభుత్వ జరుగుతున్న దాడులు అన్నీ ముఖ్యమత్రి జగన్ రెడ్డి రహస్య అజెండాలో భాగంగానే సాగుతున్నాయని, సామాన్య ప్రజలే కాదు అంతర్గత వర్గాలు కూడా అనుమానిస్తున్నాయి.