ఏపీ బడ్జెట్ నేడే... ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం


ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు నేడు 12 గంటలకు ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి వెళ్లి.. ఏపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. దీనిపై చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ..  నోటీస్ ఇచ్చినంత మాత్రన ఏపీ ప్రభుత్వానికి నష్టం ఏం లేదు.. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు.