తెలంగాణ టీడీపీ.. ఆఖరికి మిగిలింది వీరే

 

తెలంగాణ టీడీపీ దాదాపు ఖాళీ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ పార్టీ నుండి మొత్తం 15 మంది ఎమ్మెల్యేలలో పదిమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి చేరారు. ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు.. అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌ తెరాస గూటికి చేరారు. ఈ సందర్బంగా వారు స్పీకర్ కార్యలయానికి చేరి..తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ కు లేఖ అందించారు. దీంతో ఇప్పటివరకూ 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు లేఖలు అందించారు. ఇదిలా ఉండగా వీరి చేరికతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు పడిపోయింది. టీడీపీలో మిగిలిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర, ఆర్ కృష్ణయ్య.