పవన్ కళ్యాణ్, రామోజీరావు సీక్రెట్ మీటింగ్.. ఎందుకో..?
posted on Mar 10, 2016 9:44AM

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మీడియా మొగల్ రామోజీరావుతో సీక్రెట్ గా మీటింగ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ భేటీపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న గబ్బర్ సింగ్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న నేపథ్యంలో పవన్ రామోజీరావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి.. తమ పార్టీకి సంబంధించిన విషయాల గురించి.. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న భూదందాపై చర్చించినట్టు తెలుస్తోంది.
కాగా 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మార్చిలో ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆడియో వేడుక అమరావతిలో జరిపే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ 8న 'సర్దార్ గబ్బర్‌సింగ్'ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు.