ఏపీ టెన్త్ రిజల్ట్స్ 23న
posted on Apr 19, 2025 3:49PM

ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాల విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీషు మాధ్యమంలో 5,64,064 మంది, తెలుగు మాధ్యమంలో 51,069 మంది పరీక్షలు రాశారు. ఈ ఏడాది నుంచి విద్యార్థులు తమ ఫలితాలను మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా తెలుసుకునే వీలు కల్పించారు.
అలాగే అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. వాట్సాప్ ద్వా రా ఫలితాలు తెలుసుకోవాలంటే ముందుగా 9552300009 ఈ నెంబర్ మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. వాట్సాప్ ఓపెన్ చేసి ఈ నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపించాలి. వెంటనే మీకు సర్వీసెస్ ఎంపిక చేసుకోమని వస్తుంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ క్లిక్ చేస్తే టెన్త్ ఫలితాల లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే పీడీఎఫ్ రూపంలో మార్కుల మెమో వస్తుంది.