మంత్రి కొండా సురేఖకు మరో షాక్

మంత్రి కొండా సురేఖకు ప్రభుత్వం షాక్ మీద షాక్ ఇస్తోంది. ఆమె మాజీ ఓఎస్డీని విధుల నుంచి తొలగించిన ప్రభుత్వం.. అతడిపై కేసుల విషయంలో రాజీ లేకుండా అరెస్టు చేయాలంటూ పోలీసులను ఆమె నివాసానికి పంపించింది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ఆమెకు ప్రభుత్వం మరో  షాక్ ఇచ్చింది.  మేడారం జాతర పనులను ఆర్అండ్ బీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వెంటనే మేడారం జాతర పనుల రికార్డులను ఆర్ అండ్ బీకి అప్పగించాలంటూ దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేడారం జాతర పనులకు సంబంధించిన టెండర్ల విషయంలోనే మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేని సుధాకరరెడ్డిల మధ్య విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ సీఎంకు ఫిర్యాదు కూడా చేశారు. అలాగే మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ హైకమిండ్ కు లేఖ రాశారు.  ఇప్పుడు తాజాగా  మేడారం జాతర పనుల రికార్డులను ఆర్అండ్ బి శాఖకు అప్పగించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో.. కొండా సురేఖను పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనని పరిశీలకులు అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu