అనిల్ అంబానీకి బిగ్ షాక్..లుకౌట్ నోటీసులు జారీ
posted on Aug 1, 2025 8:33PM

ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 5న విచారణకు హాజరుకాకుండా ఆయన విదేశాలకు వెళ్లిపోతారనే అనుమానాల నేపథ్యంలో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. రూ. 17 వేల కోట్ల రుణాల మోసాలకు సంబంధించిన కేసులో ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దేశంలో దిగ్గజ వ్యాపారవేత్తగా వెలుగొందిన అనిల్ అంబానీకి వరుస షాకులు తగులుతున్నాయి.
రుణ మోసానికి సంబంధించిన కేసులో గతవారం అనిల్ అంబానీకి చెందిన పలు కార్యాలయాల్లో మూడు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. 50 కంపెనీలు, 25 మంది వ్యక్తులకు చెందిన ముంబయిలోని 35 ప్రాంగణాల్లో తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో పలు కీలక దస్త్రాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనకు ఈడీ సమన్లు, లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.