బాలయ్య ప్రభ నానాటికీ.. వెలుగుతుందేంటి?
posted on Aug 1, 2025 8:53PM

వరుసగా నాలుగు సెంచురీలు. ఆపై మొన్నటికి మొన్నపద్మ అవార్డు. ఆపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఎన్టీఆర్ అవార్డు. ఇప్పుడు చూస్తే ఏకంగా ఆయన చిత్రానికి జాతీయ అవార్డు. ఎటు నుంచి ఎటు చూసినా బాలకృష్ణ ప్రభ నానాటికీ వెలిగిపోతూ కనిపిస్తోంది. ఆ మాటకొస్తే ఆయన పానిండియా స్టార్ కావడానికి పెద్దగా కష్టపడనవసరం లేదని తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన అఖండ- 2 మేకింగ్ లో ఉన్నారు. ఇది చాలు బాలకృష్ణను మరో టాలీవుడ్ టర్న్ డ్ పానిండియా స్టార్ ని చేయడానికని తెలుస్తోంది. కారణమేంటంటే అది ఎలాగూ జాతీయ వ్యాప్తంగా గుర్తు పట్టే పాత్ర. కాబట్టి ఈ దిశగా బాలకృష్ణ ఇమేజీని పెంచడంలో ఏమంత కష్టం కాదంటున్నారు విశ్లేషకులు.
బాలకృష్ణతో సమానంగా అప్పట్లో ఒక వెలుగు వెలిగిన వారెవరని చూస్తే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున. ఆ రోజుల్లో చిరంజీవి- బాలకృష్ణ- వెంకటేష్- నాగార్జున ఒక టాలీవుడ్ హీరో సెట్ గా పిలిచేవారు. వీరందరిలోనూ ప్రెజంట్ హైపర్ యాక్టివ్ గా ఉన్నవారెవరని చూస్తే బాలకృష్ణ మెయిన్ గా తెలుస్తోంది.
బాలయ్య బాబు ఏ శుక్రయోగంలో ఉన్నారో తెలీదు గానీ.. ఇటు చూస్తే రాజకీయంగా టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించి వరుసగా రెండో ఏడాది కూడా దూసుకెళ్తోంది. ఇటు చూస్తే బాలయ్య బాబు కూడా అన్ని రకాలుగా విజయపరంపర కొనసాగిస్తున్నారు. ఆ మాటకొస్తే బాలయ్య బాబు సినిమా బాగా ఆడితే అది పార్టీకి కూడా ఎంతో మేలు చేస్తుందన్న సెంటిమెంట్లున్నాయ్.
అంతెందుకు ఆయన బాగుంటే అంతా బాగుంటుందన్న నమ్మకం అందరిలోనూ ఉంది. దీంతో బాలకృష్ణ పరి పరి విధాల ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ పరంగా చూసినా ఆయన మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్. ఎందుకంటే తన ఇద్దరు అల్లుళ్లలో ఒకరు ఎమ్మెల్యే- మంత్రి, మరొకరు విశాఖ ఎంపీ. ఇక కుమారుడి తెరంగేట్రం కూడా ఇదే టైంలో జరిగిపోతే.. బాలకృష్ణ సంతసం సంపూర్ణమయ్యేలా తెలుస్తోంది.