ఉచిత బస్సుల్లో సచివాలయానికి వచ్చిన అంగన్వాడీలు.. ఎందుకో తెలుసా?

అంగన్వాడీ టీచర్లు తెలంగాణ సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన చేపట్టేందుకు వారు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని  వాడుకుని వచ్చారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సులలో సచివాలయానికి వచ్చిన వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు.

డిమాండ్లను నెరవేర్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూల్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకు దిగిన అంగన్వాడీ టీచర్చను అదుపులోనికి తీసుకుని వారు వచ్చిన ఫ్రీ బస్సుల్లోనే పోలీసు స్టేషన్లకు తరలించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu