ఆంధ్రప్రదేశ్ తదుపరి సీఎస్ విజయానంద్

ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్  పదవీ కాలం మంగళవారం (డిసెంబర్ 31)తో ముగియనుంది. దీంతో  ఆయన స్థానంలో తదుపరి సీఎస్ ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ఇక నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని మరోసారి పొడిగిస్తారా? అన్న చర్చ జరిగినప్పటికీ, ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే తదుపరి సీఎస్ గా చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నాయి.

సీనియారిటీ జాబితా ప్రకారం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఆ పదవి చేపట్టాల్సి ఉన్నప్పటికీ, ఆమెకు ఆ పదవి దక్కే అవకాశం లేదు. జగన్ హయాంలో ఆ పార్టీ కార్యర్తగా ఆమె తన హోదాను, పదవిని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదీ కాక జగన్ ప్రభుత్వం పతనమైన తరువాత రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో సీఎస్ రేసులో శ్రీలక్ష్మి చీఫ్ సెక్రటరీ పదవి కోసం మొత్తం ఎనమిది మంది సీనియర్ ఐఏఎస్‌లు  సీఎస్ రేసులోనే లేకుండా పోయారు.  ఇక మిగిలిన వారిలో ఆర్పీ సిసోడియా, అనంత రాము,  అజయ్ జైన్, సాయిప్రసాద్, సుమితా దావ్రా, విజయానంద్, రాజశేఖర్‌ ఉన్నారు. వీరిలో ప్రముఖంగా 1992 బ్యాచ్‌కు చెందిన విజయానంద్, 1991 బ్యాచ్‌కు చెందిన ఆర్పీ సిసోడియా, సాయి ప్రసాద్ పేర్లు చంద్రబాబు పరిశీలించారని సమాచారం. వీరిరువురిలో కూడా చంద్రబాబు 1992 బ్యాచ్ కు చెందిన కే. విజయానంద్ వైపే మొగ్గు చూపారు.   

1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కె విజయానంద్ 1993లో అదిలాబాద్ అసిస్టెంట్ కలెక్టర్‌గా కేరీర్ ప్రారంభించారు. తరువాత 1996లో రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం 1996 నుండి గ్రామీణాభివృద్ది శాఖ ప్రాజక్ట్ డైరెక్టర్‌గా, తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్‌గా  పనిచేశారు.  2008లో ప్లానింగ్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా విజయానంద్‌ భాద్యతలు నిర్వహించారు. 

విజయానంద్ 2022 నుండి ఏపి జెన్ కో ఛైర్మన్‌గా 2023 నుండి ఏపి ట్రాన్స్ కో ఛైర్మన్ అండ్ ఎండిగా, ఎనర్జీ డిపార్టమెంట్ స్పెషల్ సిఎస్‌గా పనిచేశారు. దీంతో పాటు ఎనర్జీ డిపార్టమెంట్ సెక్రటరీగా ఏపిపిసిసి, ఏపిఎస్పిసిఎల్, ఎన్ఆర్ఈడీసిఏపి, ఏపిఎస్ఈసిఎమ్ ఛైర్మన్‌గా  భాద్యతలు నిర్వహించారు. దక్షిణ ప్రాంతీయ పవర్ కమిటీకి ఛైర్మన్‌గా 2023-24 కు వ్యవహరించారు. కీలక సమయంలో విద్యుత్ సంక్షోభాలను పరిష్కరించడంలో విజయానంద్‌ కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను సిఎం చంద్రబాబు మార్గనిర్దేశంలో అమలులోకి తెచ్చారు. ఈ విధానం ద్వారా 160 గెగావాట్ల క్లీన్ ఎనర్జీని పెంపోందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పాలసీ ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా నిర్ధేశించారు. తద్వారా 7లక్షల 50 ఉద్యోగాల కల్పనకు అవకాశం కలిగింది. 14 ఏళ్ల పాటు విద్యుత్ రంగాంలో ఆయన చేసిన సేవల వల్ల ఆ రంగంలో కీలక మార్పులు చేశారు. హుద్ హుద్, తిత్లీ లాంటి విపత్తుల సమయంలో కూడా విజయానంద్ విద్యుత్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు. 

2016 నుండి 19 వరకూ ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎలక్ట్రానిక్ పాలసీ, డేటా సెంటర్ పాలసీల రూపాకల్పన కీలకంగా వ్యవహరించారు.   ఏపీ సీఎస్ గా నియమితులైన కె విజయానంద్‌కు పలువురు ఐఏఎస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.  తనను సీఎస్‌గా ఎంపిక చేసినందుకు సీఎం చంద్రాబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖమంత్రి నారాలోకేష్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవితో పాటు మంత్రి వర్గంలోని అందరికీ విజయానంద్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలతోపాటు బలహీన వర్గాల అభివృద్దికి కృషి చేస్తానని ఈ సందర్భంగా విజయానంద్ అన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu