ఏపీ ప్రభుత్వ ‘పద్మ’ ప్రతిపాదనలు ఇవే...

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాదికి ‘పద్మ’ అవార్డుల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు పేరును 'పద్మ విభూషణ్' పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేయనుంది. బాపుతో బాటు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ రాజ్ రెడ్డి పేర్లను 'పద్మవిభూషణ్'కు సిఫార్సు చేస్తోంది. అదేవిధంగా.. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చాగంటి కోటేశ్వరరావు, శాస్త్రీయ సంగీత విద్వాంసులు నేదునూరి కృష్ణమూరి, సినీనటుడు, ఎంపీ మురళీమోహన్ పేర్లను 'పద్మభూషణ్' కోసం సిఫార్సు చేస్తున్నట్టు తెలిసింది. ఇక 'పద్మశ్రీ' పురస్కారం జాబితాలో ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు పేరు ఉన్నట్టు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu