పవన్ పేరుని నేనెందుకు వాడుకోవాలి.. రేణు దేశాయ్
posted on Sep 15, 2014 4:38PM
.jpg)
తాను తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ పేరును వాడుకోవాల్సిన అవసరం లేదని సినీ నటి రేణు దేశాయ్ ట్విట్టర్లో చెప్పారు. రేణు దేశాయ్ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి పవన్ కల్యాణ్ పేరు ఉపయోగించుకుంటోందని వస్తున్న వార్తల మీద ఆమె ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్‌ను పెళ్ళాడకముందే తాను నటినని, సుప్రసిద్ధ మోడల్‌నని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. గత యేడాది ఎవరి సహాయ సహకారం లేకుండానే తాను స్వంతంగానే హిట్ సినిమా తీశానని ఆమె గుర్తు చేశారు.తనపై వ్యాఖ్యలు చేసేవారు ఆ శక్తిని మరేదైనా సామాజిక ప్రయోజనం కోసం ఉపయోగిస్తే మంచిదని హితవు పలికారు. పవన్ కల్యాణ్‌పై అభిమానం ఉంటే మంచిదేనని, ఆ అభిమానంతో ఇతరులను ఇబ్బంది పెట్టే మెసేజ్‌లు పంపడం సరికాదని ఆమె ట్విట్ చేశారు.