అమరావతికి ప్రధాని చేత శంకుస్థాపన
posted on Apr 6, 2015 6:30AM
.jpg)
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి జూన్ రెండవ వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత శంఖుస్థాపన చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకోసం ఆయన త్వరలో మరొకమారు డిల్లీ వెళ్లి నరేంద్ర మోడీని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఆయన చేత శంఖుస్థాపన చేయించడం వలన రాజధాని నిర్మాణానికి సకాలంలో నిధులు విడుదల చేయవలసిన బాధ్యత ఆయనదేననని చెప్పకనే చెప్పినట్లువుతుంది. మిగిలిన ఈ నాలుగేళ్లలో రాజధాని ప్రధాన నగరానికి రూపురేఖలు ఏర్పరచినట్లయితే, అందుకు తోడ్పడినందుకు ప్రధానికి, ఎన్డీయే ప్రభుత్వానికి తద్వారా బీజేపీకి ఆ ఖ్యాతి, రాష్ట్ర ప్రజలలో ఆదరణ కూడా దక్కుతుంది. సరిగ్గా వచ్చే ఎన్నికల సమయానికి ముందుగా ఈ మహాయజ్ఞం ఒక కొలిక్కి వచ్చినట్లయితే దాని ఫలితాలు తెదేపా, బీజేపీలేక్ ఖాయంగా దక్కుతాయి. కనుక ప్రధాని మోడీ కూడా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తిని మన్నించి శంఖుస్థాపనకు వచ్చే అవకాశాలున్నాయని భావించవచ్చును.