గుజరాత్ సీఎంగా ఆనందీబెన్ ప్రమాణం
posted on May 22, 2014 1:43PM
.jpg)
గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు గుజరాత్ గవర్నర్ కమలా బేనీవాలా ఆనందీబెన్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు అద్వానీ, రాజ్‌నాథ్, మోడీ, గడ్కరీతో పాటు పలువురు హాజరయ్యారు. కేశుభాయ్, మోడీ ప్రభుత్వాల్లో ఆనందీబెన్ కీలక పాత్ర పోషించారు. ప్రభావశీల మహిళల్లో ఒకరుగా ఆనందీబెన్‌ను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గుర్తించింది. ఆనందీ బెన్ పటేల్ 1941 నవంబర్ 21న జన్మించారు. ఆమె వయస్సు 72. బిజెపిలో ఆమె వివిధ హోదాల్లో, ప్రభుత్వంలో పలు శాఖలను నిర్వహించారు. రాజకీయ ప్రవేశానికి ముందు ఆనందీకి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. కోటీశ్వరురాలు కూడా కాదు. రైతు కుటుంబానికి చెందిన మహిళ. అయితే పట్టుదల, ధైర్యం, యోగ్యత.. తదితరాలు ఆమెను గుజరాత్ ముఖ్యమంత్రిగా చేస్తున్నాయి. అభివృద్ధి విషయంలో ఆమెది రాజీపడే తత్వం కాదని పరిశీలకులు అంటున్నారు.