జాక్‌పాట్ కొట్టిన టీడీపీ గజపతి: మోడీ కేబినెట్‌లో స్థానం
posted on May 22, 2014 3:36PM
.jpg)
విజయనగరం టీడీపీ ఎంపీగా గెలిచిన అశోకగజపతిరాజుకు కేంద్ర కేబినెట్‌లో స్థానం లభించే అవకాశాలు వుండటంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన్ని అదిరిందయ్యా అశోక్ గజపతీ.. మోడీ కేబినెట్‌లో అవకాశం సంపాదించావని అభినందిస్తున్నారు. ఈనెల 26న ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్రమోడీ కేబినెట్‌లో అశోక్ గజపతి రాజు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలిసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో చేరుతామని టీడీపీ చీప్ చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఆ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయో అన్న అంశంపై రాజకీయ వర్గాలలో సర్వత్రా చర్చ సాగింది. టీడీపీకి మొత్తం 13 మంది ఎంపీలు ఉండగా, వీరిలో ఒకరికి కేబినెట్ ర్యాంకు ఇవ్వనున్నారు. మరో రెండు సహాయ మంత్రులను అప్పగించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మోడీ మంత్రివర్గంలో కేబినెట్ హోదా దక్కించుకోనున్న వారిలో ప్రధానంగా టీడీపీ సీనియర్ నేత అశోక గజపతి రాజు ముందు వరుసలో ఉన్నారు.